యంగ్ టైగర్ ఎన్టీఆర్, సుకుమార్‌ల కాంబినేషన్‌లో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో బి.వి.ఎన్.ఎస్.ప్రసాద్ న...

Home » , , , » NTR AND SUKUMAR LATEST MOVIE STARTED IN LONDON - TOLLYWOOD NEWS

NTR AND SUKUMAR LATEST MOVIE STARTED IN LONDON - TOLLYWOOD NEWS

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సుకుమార్‌ల కాంబినేషన్‌లో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో బి.వి.ఎన్.ఎస్.ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం షూటింగ్ సోమవారం లండన్‌లో ప్రారంభమైంది. సెప్టెంబర్ 20వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ తర్వాత మరో కంట్రీలో 20 రోజుల పాటు ఓ షెడ్యూల్ చేస్తారు. ఆ తర్వాత 20 రోజుల పాటు హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్ ఉంటుంది. దీనితో టోటల్‌గా షూటింగ్ పూర్తవుతుంది. ఎన్టీఆర్ నటిస్తున్న 25వ చిత్రమిది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ చాలా కొత్తగా కనిపిస్తారని దర్శకుడు సుకుమార్ చెప్పారు.

NTR AND SUKUMAR LATEST MOVIE STARTED IN LONDON - TOLLYWOOD NEWS

NTR AND SUKUMAR LATEST MOVIE STARTED IN LONDON - TOLLYWOOD NEWS

 
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్‌లతో పాటు మరికొంత మంది భారీ తారాగణం నటిస్తున్నారు.
 
ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: విజయ్ కె.చక్రవర్తి, ఫైట్స్: పీటర్ హెయిన్స్, సమర్పణ: రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, కో ప్రొడ్యూసర్: భోగవల్లి బాపినీడు, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సుకుమార్.

0 comments:

Post a Comment

Powered by Blogger.