మెగాస్టార్ చిరంజీవికి చేదు అనుభవం ఎదురైంది. ఒక అభిమాని మెగాస్టార్ ను నిలదీశాడు. ఎప్పుడూ అభిమానుల ఆదరణనే తప్ప నిలదీతలను ఎరగని చిరంజీవి తిరు...

Home » , , , » నిలదీసిన అభిమాని.. అవాక్కైన చిరంజీవి!

నిలదీసిన అభిమాని.. అవాక్కైన చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవికి చేదు అనుభవం ఎదురైంది. ఒక అభిమాని మెగాస్టార్ ను నిలదీశాడు. ఎప్పుడూ అభిమానుల ఆదరణనే తప్ప నిలదీతలను ఎరగని చిరంజీవి తిరుపతి కి చెందిన ఈ అభిమాని తీరుతో అవాక్కయ్యాడు.

నిలదీసిన అభిమాని.. అవాక్కైన చిరంజీవి!

ఇంతకీ ఏం జరిగిదంటే... కడప జిల్లా రైల్వే కోడూరులో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్లాడు మెగాస్టార్. ఈ కార్యక్రమం కోసం ఆయన తిరుపతి మీదుగా రైల్వే కోడూరకు వెళ్లడానికి రేణుగుంట విమానాశ్రయానికి చేరుకొన్నాడు. ఎయిర్ పోర్టులో చిరంజీవి వస్తున్న విషయం తెలుసుకొని అక్కడున్న జనాలు గుమికూడారు. అలాంటి వారిలోని ఒక అభిమాని చిరంజీవికి షాక్ ఇచ్చాడు. తిరుపతి ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశావ్? అంటూ ప్రశ్నించి మెగాస్టార్ ను ఇబ్బంది పెట్టాడు.
ఒక్కసారిగా ఆ వ్యక్తి అలా రెచ్చిపోయే సరికి చిరంజీవి చేయగలిగింది ఏమీ లేకపోయింది. ఆ నీలదీతకు సమాధానం లేకపోయింది. అయితే భద్రతా సిబ్బంది, పోలీసులు జోక్యం చేసుకొని చిరంజీవికి తలనొప్పి తగ్గించారు. అలా ప్రశ్నించిన అభిమానిని పక్కకు ఈడ్చేశారు. అయితే పోలీసుల వారు ఇలా వ్యవహరించడం పట్ల అక్కడున్న అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
 ప్రజారాజ్యం పార్టీ ని ఏర్పాటు చేసి చిరంజీవి తిరుపతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయం తెలిసిందే. 2009 ఎన్నికల్లో అక్కడ నుంచి గెలిచిన చిరంజీవి దాదాపు రెండేళ్లు తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. రాజ్యసభ సభ్యుడిగా వెళ్లిపోయాడు. మరి ఎన్నో ఆశలతో చిరంజీవికి ఓటేసిన అభిమానుల్లో అయితే చిరంజీవిపై ఇలాంటి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అవకాశం వస్తే అది ఇలా బయటపడుతోంది!

0 comments:

Post a Comment

Powered by Blogger.